18 Pages Movie : 18 పేజెస్ ప్రీ రిలీజ్ బిజినెస్.. ఇంతేనా.. ఈజీగానే టార్గెట్ కొట్టేస్తానంటున్న నిఖిల్..

Updated 22nd December 2022 Thursday 1:40 pm

18 Pages Movie :  హీరో నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కార్తికేయ 2 సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఇప్పుడు మళ్ళీ అనుపమ, నిఖిల్ కలిసి 18 పేజెస్ సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

కార్తికేయ 2తో 100 కోట్లు సాధించడంతో నిఖిల్ 18 పేజెస్ సినిమాకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని భావించారు. అయితే ప్రస్తుతానికి 18 పేజెస్ కేవలం తెలుగులోనే రిలీజ్ అవుతుండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ సాధారణంగానే జరిగింది.

18 పేజెస్ ప్రీ రిలీజ్ బిజినెస్..
నైజాం – 3.50 కోట్లు
సీడెడ్ – 1.5 కోట్లు
ఆంధ్ర – 5 కోట్లు
టోటల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రెస్టాఫ్ ఇండియా – 0.50 కోట్లు
ఓవర్సీస్ – 1.50 కోట్లు

మొత్తంగా నిఖిల్ 18 పేజెస్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 13 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ అయి సినిమా హిట్ అవుతుంది. అయితే ప్రస్తుతం నిఖిల్ కి ఉన్న క్రేజ్ కి ఇది తక్కువే కావడంతో చిత్ర యూనిట్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయి లాభాల్లోకి దూసుకుపోతాము అంటున్నారు. కచ్చితంగా నిఖిల్ చాలా తక్కువ టైంలోనే బ్రేక్ ఈవెన్ చేస్తాడు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us