పులిమేరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బందిపై డీఎంహెచ్వో ఫైర్

UPDATED 8th NOVEMBER 2017 WEDNESDAY 8:00 PM

పెద్దాపురం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్యను పెంచి, మాతా శిశు సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రమేష్ కుమార్ వైద్యులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి డాక్టర్ రాంబాబునాయక్ ను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. స్టాఫ్ నర్స్, మ్యాటీ అసిస్టెంట్ తదితర సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆయన తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎపిఎంఐడిసి నిధులు రూ.1.40  కోట్లుతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల వీరాస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us