UPDATED 29th JUNE 2017 THURSDAY 6:00 PM
పెద్దాపురం : విద్యావ్యవస్థలో ర్యాగింగ్ అనే విష సంస్కృతిని విడనాడాలని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ అన్నారు. మండల పరిధిలోని దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల హెవోడీలు, సిబ్బంది, విద్యార్థులతో యాంటీ ర్యాగింగ్ పై నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొని గురువారం మాట్లాడారు. విద్యార్థుల పట్ల తోటి విద్యార్థులు అమానుషంగా ప్రవర్తించడమే ర్యాగింగ్ అని, దాన్ని విడనాడినప్పుడే విద్యార్థుల్లో పరస్పర స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ర్యాగింగ్ నిరోధానికి ప్రభుత్వం కఠిన చట్టాలను చేసిందని పేర్కొన్నారు. సత్ప్రవర్తన కలిగిన విద్యా విధానమే కిట్స్ కళాశాల లక్ష్యం అని పేర్కొన్నారు. అలాగే కళాశాలలో యాంటీ ర్యాగింగ్ పై ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే ఈ విషయంపై పోలీస్, న్యాయ శాఖలతో అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిట్స్ ఏవో కే.ఆర్. సందీప్, ఈవో జెన్నీబాబు, ఏసివో పెదకాపు తదితరులు పాల్గొన్నారు.







