మీడియా ప్రతినిధిపై దాడిని నిరసిస్తూ డీఎస్పీకు ఫిర్యాదు

UPDATED 4th SEPTEMBER 2017 MONDAY 2:00 PM

పెద్దాపురం : మీడియా ప్రతినిధి పై దాడిని నిరసిస్తూ పెద్దాపురం నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజె ప్రతినిధులు డిఎస్పీ చిలకా వెంకట రామారావుకు సోమవారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాకుర్తి రాంబాబు, నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు అడపా వెంకట్రావు, అధ్యక్షుడు బూరాడ శ్రీనివాసరావు, కార్యదర్శి రెడ్డిపల్లి రమణమూర్తి (బుల్లియ్య), ఈసీ మెంబర్ పి.వీరభద్రవర్మ ఆధ్వర్యంలో ఆయనకు ఈ ఫిర్యాదు చేసి మాట్లాడారు. గతనెల 27న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాదయాత్ర వార్తను చిత్రీకరించే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెద్దాపురం నియోజకవర్గ మహా టీవీ విలేఖరి పచ్చాకుల లోవరాజుపై దాడి చేయడంతో పాటు అతని కెమెరాను అపహరించారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకు విజ్ఞప్తి చేశారు. దీనిపై డీఎస్పీ మాట్లాడుతూ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, బాధితునికి న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ఆలీ, సుధాకర్, రాజా, వెంకట్, సుబ్రహ్మణ్యం (సుబ్బు), శ్రీకాంత్, శ్రీనివాస్, వినాయక్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us