రెండు నెలల్లో పునరావాస కాలనీలు నిర్మించాలి : పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ఆనంద్

దేవీపట్నం,23 మే 2020 (రెడ్ బీ న్యూస్) : పోలవరం నీటి పారుదల ప్రాజెక్టు మూలంగా ముంపుబారిన పడిన నిర్వాసిత కుటుంబాలకు రెండు నెలల కాలవ్యవధిలో పునరావాస కాలనీ నిర్మాణాలు పూర్తిచేయాలని ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మండల పరిధిలో ఇందుకూరు - 1, పెదబీంపల్లి - 2, మునళ్లకుంట పునరావాస కాలనీల నిర్మాణాలు, మౌలిక సదుపాలయాల కల్పన పనులును ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరావాస కాలనీల నిర్మాణాలు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని ఆదేశించారు.ఇటీవల కరోనా వైరస్ కట్టడి లాక్ డౌన్ ప్రభావంతో నిర్మాణాలు నిలిచిపోయాయని మళ్లీ వీటి నిర్మాణాలను ప్రారంభించామని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. అందుకు అనుగుణంగానే నిర్మాణ పనులు పూర్తి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి రెండు నెలల కాలవ్యవధిలో పూర్తి చేసి నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలన్నారు. చేసిన నిర్మాణ పనులుకు ఎప్పటిప్పుడు మస్తర్లు, రికార్డింగు చేసి బిల్లులు రూపొందించి సమర్పించాలన్నారు.అలా చేసినవాటికి చెల్లింపులు వెంటనే చేస్తామన్నారు. కాంట్రాక్టర్లకు అన్నిరకాలుగా నిర్మాణ పనులు శరవేగంగా సాగేందుకు వీలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మూలంగా సుమారు 20 వేల నిర్వాసిత కుటుంబాలు ముంపు బారిన పడ్డాయని వీరిలో 3 వేల నిర్వాసిత కుటుంబాల వారికి ఇప్పటికే పునరావాస కాలనీలలో ఆశ్రయం కల్పించడం జరిగిందన్నారు. మిగిలిన 17 వేల నిర్వాసిత కుటుంబాలకు రెండు నెలల తర్వాత పునరావాప కాలనీలకు తరలించేందుకు అన్ని పనులు వేగవంతం చేశామన్నారు. మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్లు, త్రాగునీటి వసతులు, మురుగుకాలువలు, షాపింగ్ కాంప్లెక్సులు వంటి సదుపాయాల కల్పన నిర్మాణ పనులు గృహ నిర్మాణాలకు సమాంతరంగా చేపట్టి సకాలములో పూర్తి చేయాలని ఆదేశించారు. పునరావాస కాలనీలు పూర్తి సౌకర్యాలతో ఉండేలా అన్ని కార్యాచరణ ప్రణాళికలు పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. నిర్మాణాల కోసం అవసరమైన ఐరన్, సిమ్మెంట్, ఇసుక మెటీరియల్ ప్రభుత్వ పరంగా సరఫరా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు తమకు అవసరమైన మెటీరియల్ ను ఇండెంట్లు ద్వారా కోరాలని ఆయన సూచించారు. అలాగే అవసరమైన ల్యాబరును సమకూర్చుకొని నిర్మాణ పనులు మరింతగా వేగవంతం చేయాలని ఆదేశించారు. చివరగా ఆయన పునరావాస కాలనీలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు జి.వి ప్రసాద్, వై.శ్రీనివాస్, డిఈలు శ్రీనివాసరావు, సూరిబాబు, డిప్యూటీ తాహశీల్దారు ఆర్. వెంకటేశ్వరరావు,ఇంజనీరింగ్ సిబ్బంది గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us