గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి

UPDATED 3rd JUNE 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. మండలంలోని హుస్సేన్ పురం గ్రామంలో నవనిర్మాణ దీక్ష రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా మంత్రి ఆదివారం ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎన్.ఆర్.జి.ఎస్, ఐసిడిఎస్ నిధులు రూ. ఏడు లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నూరుశాతం మౌళిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టిందని, ఇప్పటికే అన్ని గ్రామాల్లోను సి.సి.రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీ, పంచాయతీ భవనాలు, త్రాగునీరు, వీధిదీపాలు, తదితర వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికి ప్రజలకు అందచేస్తామన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని, ప్రజల సమన్వయంతో గ్రామాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. అంగన్వాడీ కేంద్రాలు నిరుపేద పిల్లలకు ఆదర్శ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, వారి భవిష్యత్తు బంగారుబాట చేయడమే ఈ కేంద్రాల ప్రధాన బాధ్యత అన్నారు. ఈ కేంద్రాలకు పంచాయతీ నిధులతో పిల్లల భోజనాలకు సంబందించిన సామానులను సమకూర్చడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి గుమ్మళ్ళ విజయలక్ష్మి, ఏఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు (శ్రీనుబాబు), సిడిపివో టి.డి.ఆర్. పద్మావతి, పంచాయతీ రాజ్ డి.ఇ వై. హరినాధరావు, ఈవోపిఆర్డీ జగ్గారావు, తోటకూర శ్రీను, చల్లా బుజ్జి, గుమ్మళ్ళ రామకృష్ణ, అంగన్వాడీ సూపర్ వైజర్లు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us