UPDATED 16th JUNE 2017 FRIDAY 2:00 PM
పెద్దాపురం: పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్పీ వి. అజిత శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ లో ఉన్న రికార్డులను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు, అలాగే ప్రజలకు పోలీస్ వ్యవస్థపై మరింత నమ్మకం కలిగించేలా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు పోలీసులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం కలిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కార్యాలయ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీఐ ప్రసన్నవీరయ్య గౌడ్, ఎస్ఐ ఎ . కృష్ణభగవాన్, ఏఎస్ఐ ఏసుబాబు, సిబ్బంది పాల్గొన్నారు.







