Brother Anil Kumar : జగన్‌కు షాకివ్వనున్న బ్రదర్ అనిల్ ?

UPDATED 15th MARCH 2022 TUESDAY 06:00 AM

Brother Anil Kumar : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు బావ అనిల్‌కుమార్‌ షాకివ్వనున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్దిరోజులుగా బ్రదర్ అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటనలు చూస్తుంటే అదే అనుమానం కలుగుతోంది. జగన్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు అర్థమవుతుంది.గత ఎన్నికల్లో జగన్ విజయానికి కృషి చేసిన షర్మిల, అనిల్‌.. ఈసారి రివర్స్ అయినట్లే కనపడుతోంది.

తాజాగా ఆయన చేసిన కామెంట్స్‌.. దీనికి బలం చేకూరుస్తున్నాయి. బీసీని సీఎం చేస్తే మద్దతిస్తామని చెప్పడం ఇప్పుడు హాట్‌ టాపిగ్గా మారింది. కొద్దిరోజులుగా బ్రదర్ అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఆయన వైఖరి చూస్తుంటే కొత్త పార్టీ కోసం పావులు కదుపుతున్నట్లు అర్థమవుతుంది. సోమవారం మార్చి3న ఆయన వైజాగ్‌లో పర్యటించారు.

ఓ హోటల్‌లో క్రైస్తవ సంఘాలతో సమావేశమయ్యారు. ఏపీలో రాజకీయ పార్టీ పెడతారని జోరుగా ప్రచారం నేపథ్యంలో.. ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రదర్ అనిల్ కుమార్ మొదటిసారిగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో ఇటీవల భేటీ కావడం రాజకీయ కారణాలేనని చెప్పక తప్పదు.

ఉండవల్లి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఉండవల్లితో బ్రదర్ అనిల్ భేటీ మర్యాదపూర్వకంగానే అని చెప్తున్నప్పటికీ.. అప్పటి వ్యవహారశైలి తెలిసిన వాళ్లంతా రాజకీయాల కోసమే అని చెప్పుకుంటున్నారు. బద్రర్ అనిల్ అంతటితో ఆగలేదు. ఆ తర్వాత విజయవాడలో బీసీ, మైనారిటీ నేతలతో సమావేశమయ్యారు. వాళ్లు.. సొంతపార్టీ పెట్టాలని అండగా ఉంటామని బ్రదర్‌ అనిల్‌ను కోరారు.

అయితే అప్పుడు మాత్రం ఏమీ చెప్పకుండానే బ్రదర్ అనిల్ వెళ్లిపోయారని తెలిసింది. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెళ్లిపోయారని తెలిసింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us