Updated 10th May 2023 Wednesday 12:10 pm
Mudragada padmanabham : కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఖారారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ కాపు ఉద్యం నేత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానంటు ప్రకటించారు. త్వరలో రాజకీయాల్లో వస్తానంటూ ప్రకటించారు. దీంతో ముద్రగడ ఏపార్టీలో చేరతారు? అనేది ఆసక్తికరంగా మారింది. బహుశా ఆయన వైసీపీలోనే చేరతాను అనే మాట బలంగా వినిపిస్తోంది.
ఎందుకంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ల గురించి డిమాండ్ చేస్తూ ముద్రగడ చేపట్టిన ఆందోళనల్లో తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనానికి కారణమైంది. ఈ ఘటనలో ముద్రగడపై పలు కేసులు నమోదు అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముద్రగడపైనా..తుని ఘటనపై నమోదు అయిన కేసులన్నీ ఎత్తివేసింది. దీంతో ముద్రగడ స్వయంగా వెళ్లి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈక్రమంలో ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీ వైసీపీలోనే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. దీంట్లో భాగంగానే వైసీపీ కాపు ఓట్లే లక్ష్యంగా ముద్రగడను రంగంలోకి దింపుతోందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కాపు ఓట్లే లక్ష్యంగా ముద్రగడ రీ ఎంట్రీ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ముద్రగడ పద్మనాభం ప్రజలకు బహిరంగ లేఖ రాస్తూ త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ పొలిటికల్ రీ ఎంట్రీ గురించి హింట్ ఇచ్చారు. ప్రజల్లో మార్పు రావాల్సి ఉందని అభిప్రాయపడిన ముద్రగడి ప్రజలు మార్పు వస్తేనే రాజకీయాల్లో మార్పు వస్తుందన్నారు. ఉద్యమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ డబ్బు సంపాదించాలనే ఆలోచన తనకు ఎప్పుడు రాలేదని తెలిపారు. 2016లో తుని ఘటన తరువాత తనను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపించానికి యత్నాలు జరిగాయని దాని కోసం మెలికాప్టర్ ను రెడీ ఉంచారు అంటూ పరోక్షంగా టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేఖ రాశారు. త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని.. ప్రజల్లో మార్పు రావాల్సి ఉందన్నారు. ఉద్యమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ డబ్బు సంపాదించాలనే ఆలోచన ఎప్పుడు రాలేదన్నారు. నా జాతి రిజర్వేషన్ జోకరు కార్డులా అయినందుకు భాధ పడుతున్నానని.. పేదవారి కోసం తాను చేసే ఉద్యమాలు వారి చిరునవ్వే తనకు ఆక్సిజన్ అన్నారు. కాగా గతంలో జనసేన, బీజేపీ నేతలు ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపారు. కానీ ఆయన నుంచి ఎటువంటి సానుకూలతరాలేదు. ఈక్రమంలో అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గరపడుతున్న క్రమంలో ముద్రగడ రాజకీయ ప్రవేశం అంటూ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.







