UPDATED 8th JULY 2018 SUNDAY 6:00 PM
పెద్దాపురం: పట్టణంలో వేంచేసివున్న మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో జేష్ఠ బహుళ దశమి తిథిని పురస్కరించుకుని ఆదివారం ఆయుష్షు హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమీషనర్ ఆర్. పుష్పనాథం ఆధ్వర్యంలో వేదపండితులు చిట్టెం హరిగోపాలశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేషపూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, ధర్మకర్తలు తమ్మన మైనర్ బాబు, కొంగర సత్యనారాయణ, ఆకుల మురళీకృష్ణ, కొఠాని గణేష్, అద్దేపల్లి భాస్కరరావు, పండితులు వెంకటశాస్త్రి, ఐవి ప్రసాద్ శర్మ, ఎక్స్ అఫీషియో రాయి విజయకుమార్, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.







