తిరుమల (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: తిరుమల ఘాట్ రోడ్‌లో కొండచరియలను కేరళ కొల్లంలోని అమృత విశ్వవిద్యాలయం నుంచి వరల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఆన్ ల్యాండ్ స్లైడ్ డిజాస్టర్ రిడక్షన్ కింద అంతర్జాతీయ ప్రాజెక్టు చేస్తున్న నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది. కొండ చరియలు విరిగిపడకుండా మందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం తితిదే వీరిని ఆహ్వానించింది. ల్యాండ్ స్లైడ్స్ నిపుణులు కొండ చరియలు విరిగిపడిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని సమగ్ర సర్వే నిర్వహించి తితిదేకు నివేదిక అందించనున్నారు. అమృత విశ్వవిద్యాలయం స్ట్రాటజిక్ ఇన్షియేటివ్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ విభాగానికి చెందిన నిపుణులు ప్రొఫెసర్ మనీషా, నిర్మల వాసుదేవన్, సుదేష్ విద్వాన్, తితిదే డీఎఫ్‌ఓ శ్రీనివాసులు రెడ్డి, ఈఈ సురేంద్రనాథ్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు







