Updated 17th December 2022 Saturday 6:20 am
Avatar - 2 : అవతార్ సినిమా చూస్తుండగా గుండెపోటుకు గురైయ్యాడో వ్యక్తి.. ఆసుపత్రికి తరలించే సమయంలో మార్గమధ్యలోనే వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి శ్రీను (38) తన స్నేహితులతో కలిసి పెద్దాపురం పట్టణంలో లలితా థియేటర్లో అవతార్ సినిమా చూసేందుకు శుక్రవారం వెళ్ళాడు.. సినిమా చూస్తుండగా శ్రీనుకు ఛాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా థియేటర్ లోనే కుప్పకూలిపోయాడు. థియేటర్ సిబ్బందికి విషయం తెలియచేయడంతో అతనిని సమీపంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.







