జూన్ నుంచి కార్యాలయాల తనిఖీ

UPDATED 24th MAY 2017 WENESDAY 7:00 PM

కాకినాడ: రాష్ట్ర ఎస్ సి, ఎస్ టి కమీషన్ జూన్ నెల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు యూనివర్సిటీలలో విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఆయా వర్గాల సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తుందని కమీషన్ చైర్మన్ కారెం శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో విలేఖరుల సమావేశం నిర్వహించి కమీషన్ చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదుగురు సభ్యులతో కూడిన తమ కమీషన్ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నియామకాలు, పదోన్నతులు, రూల్ అఫ్ రిజర్వేషన్ అమలు ఎస్ సి, ఎస్ టి సబ్ ప్లాన్ నిధుల సక్రమ వినియోగం వంటి అంశాలను నిశితం గా పరిశీలిస్తుందన్నారు. అలాగే ఈ సంస్థలలో కుల వివక్ష ఉనికి కొనసాగితే తగిన చర్యలు చేపడుతుందన్నారు. ఎస్ సి, ఎస్ టి ప్రజల భూమి సమస్యల సత్వర పరిష్కారానికి కమీషన్ కృషి చేస్తుందని, ఈ వర్గాల ప్రజలపై దాడులు, అరాచకాలకు పాల్పడిన వారిని శిక్షించడంతో పాటు బాధితులకు ఆర్ధిక సహాయాలు వెంటనే అందేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాశి శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us