జూలై 7 నుంచి చంద్రన్న రైతు భీమా నమోదు

UPDATED 6th JULY 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: అన్నదాతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న చంద్రన్న రైతు భీమా నమోదు ప్రక్రియను ఈ నెల ఏడు నుంచి ప్రారంభించి 15 వరకు అమలు చేయాలని డిఆర్డీఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్. మధుసూధనరావు అన్నారు. స్థానిక టిటిడిసిలో భీమామిత్రలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరిగిన ఏరువాక కార్యకమంలో చంద్రన్న భీమా తరహాలో రైతులకు కూడా భీమా పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారని,18 నుంచి 69 సంవత్సరాల లోపు వయస్సు రైతులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. నమోదు బృందాలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని, వారికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని, రైతులు వారికి ఆధార్ కార్డు నకలు, ప్రస్తుత చిరునామా, మొబైల్ ఫోను నంబరు ఇవ్వాలన్నారు. వెబ్ ల్యాండ్ లో రైతు పేరు నమోదు కాకుంటే తప్పనిసరిగా పట్టాదారు పాసుపుస్తకం నకలు ఇవ్వాలని, కౌలు రైతులు అయితే రుణ అర్హత కార్డు నకలు ఇవ్వాలన్నారు. అలాగే ఆధార్ తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా వివరాలు అందచేయాలని, ఈనెల 15వ తేదీలోగా రైతుల నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ వై.డి. విజయకుమారి, డిపిఎం కేశవరావు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us