Russia-Ukraine War : 219 మంది భారతీయులతో యుక్రెయిన్ నుంచి ముంబై చేరుకున్న తొలి విమానం..

UPDATED 26th FEBRUARY 2022 SATURDAY 08:30 PM

Russia-Ukraine War : యుక్రెయిన్ 219 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిరిండియా విమానం కొద్దిసేపటి క్రితమే ముంబై చేరుకుంది. రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి తొలి విమానం బయల్దేరింది. ముంబైలో ల్యాండ్ అయిన ఎయిరిండియా విమానంలో 219 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థులను స్వస్థలాలకు తరలంచేందుకు రాష్ట్రప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

యుక్రెయిన్ లో నెలకొన్న భయానక పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్న వందలాది మంది భారతీయులు భయాందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడూ స్వస్థలాలకు సేఫ్‌గా తిరిగి వెళ్తామా అని బిక్కుబిక్కుమంటూ గడిపేశారు. ఎయిరిండియా విమానంలో యుక్రెయిన్‌లోని బుకారెస్ట్ నుంచి తిరిగి స్వదేశానికి తిరిగి చేరుకోవడంతో 219 భారతీయులు ఊపిరిపీల్చుకున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us