AP News: వైద్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: ఒమిక్రాన్‌ కలకలంతో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ కీలక సమీక్ష ముగిసింది. వైద్య ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం పచ్చజెండా ఊపారు. ఫిబ్రవరి నాటికి ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది ఉండాలన్నారు. అదే సమయానికి కొత్త నియామకాలు కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. బూస్టర్‌డోసుకు ఏర్పాట్లు చేయండి కరోనా, ఒమిక్రాన్‌ ప్రభావాల దృష్ట్యా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ఉద్ధృతం చేయాలన్న సీఎం.. ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయాలన్నారు. ఒమిక్రాన్‌ విషయంలో ఎలాంటి భయాందోళనలు అవసరంలేదన్నారు. ఒమిక్రాన్‌ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. కేంద్రం బూస్టర్‌ డోసు ప్రకటన దృష్ట్యా అందుకుఅనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us