హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022 : ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టడంపై వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. హైదరాబాద్‌లో మీడియా చిట్‌చాట్‌లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ పెడతారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని అన్నారు. పార్టీ పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా? అని ప్రశ్నించారు.
వైటీపీలో చేరిన టీఆర్ఎస్ సీనియర్ నేత
టీఆర్ఎస్ సీనియర్ నేత, బీసీ నాయకుడు గట్టు రాంచందర్‌రావు ఇవాళ వైటీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పి రామచందర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు.







