కడప (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: కడప శివారు కేఎస్‌ఆర్‌ఎమ్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. దుండగులు గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎంలోని రూ.17లక్షల నగదును అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐదుగురు వ్యక్తులు ఏటీఎంలోకి ప్రవేశించారు. అందులోని సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఏటీఎం మిషన్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఉదయం ఏటీఎం చోరీని గుర్తించిన బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ వెంకట శివారెడ్డి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో పరిసర ప్రాంతాల్లో ఆధారాలు సేకరించారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.







