నేత్రపర్వం.. అమ్మవారి పంచమీతీర్థం

తిరుచానూరు (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం పంచమీతీర్థం నేత్రపర్వంగా జరిగింది. ఆలయం ముందు భాగంలోని వాహన మండపం వద్ద ఏర్పాటు చేసిన చిన్న పుష్కరిణిలో ఉదయం 11.52 గంటలకు కుంభలగ్నంలో చక్రస్నానం నిర్వహించారు. ముందుగా తిరుమల నుంచి అమ్మవారికి తీసుకెళ్లే సారెను అలపిరి వద్ద ఏఈవో ధర్మారెడ్డి అలిపిరి వద్ద జేఈవో వీరబ్రహ్మంకు అందజేయగా.. ఆయన ఆలయం వద్ద ఈవో జవహర్‌రెడ్డికి అందజేశారు. రాత్రి ధ్వజావరోహణ కార్యక్రమం జరిగింది. పంచమీతీర్థంలో జీయ్యంగార్లు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పాలక మండలి సభ్యుడు పోకల అశోక్‌కుమార్‌, జేఈవో సదాభార్గవి, ఆగమ సలహాదారుడు శ్రీనివాసాచార్యులు, ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరి, పేష్కార్‌ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us