Janasena : కోటంరెడ్డి ఫోన్ ట్యాప్ ఆరోపణలపై డీజీపీ ఎందుకు స్పందించట్లేదు..? : పవన్ కల్యాణ్

Updated 2nd February 2023 Thursday 4:10 pm

Janasena  Pawan kalyan : నా ఫోన్ ట్యాప్ చేశారు అంటూ నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలపై డీజీపీ ఎందుకు స్పందించటంలేదు? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇవి కేవలం ఆరోపణలే అయితే కాదు  ఎందుకు నిరూపించే చర్యలు తీసుకోవటంలేదు? అని ప్రశ్నించారు. కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాప్ ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏపీలో రాజకీయాలు ప్రతీకారాలకు పరాకాష్టకు చేరాయని..సాక్షాత్తు శాసనసభ సభ్యులే ప్రాణహానితో భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు. ఎమ్మెల్యే ఆనం తన అభిప్రాయాలను వెల్లడించటం వల్లే ఆయనకున్న సెక్యూరిటీని తగ్గించారని విమర్శించారు పవన్. తన నియోజకవర్గం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం సమస్యల్ని పరిష్కరించమని అడగటం తప్పెలా అవుతుందని ఎమ్మెల్యేగా తనకున్న బాధ్యతను నెరవేర్చాలని కోరటం తప్పెలా అవుతుంది? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. ఇటువంటి ప్రతీకార రాజకీయాలు సమాజానికి చోటు చేస్తాయని అన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us