UPDATED 8th SEPTEMBER 2018 SATURDAY 8:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఇసిఇ విభాగం ఈ నెల మూడు నుంచి ఎనిమిదవ తేదీ వరకు రియల్ టైం ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐవోటి అప్లికేషన్స్ పై వరంగల్ ఎన్ఐటి సౌజన్యంతో అధ్యాపకులకు వారం రోజులపాటు అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జెఎన్టీయూకె ఇసిఇ ప్రొఫెసర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.ఎం. ప్రసాద్, రిసోర్స్ పర్సన్స్ గా డాక్టర్ కె.ఎం. భుర్చండి, డాక్టర్ జె. రవికుమార్, పి. మధు, డాక్టర్ పి. మురళీధర్, డాక్టర్ ఎం. సతీష్, డాక్టర్ రష్మీ రంజన్ రౌత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ ఎఫ్.డి.పి ద్వారా అధ్యాపకులు పురోగమిస్తున్న ప్రపంచ సాంకేతికతతో ప్రతీ ఒక్కరూ నవీకరణ చెందాలని కోరారు. ముఖ్య అతిధి డాక్టర్ ఎ.ఎం. ప్రసాద్ మాట్లాడుతూ ఐవోటి ద్వారా వివిధ పరికరాలను సులభంగా వినియోగించుకోవచ్చునని, అంతేకాక గూగుల్ ట్రెండ్స్ ద్వారా ప్రపంచంలో కొనసాగుతున్న నూతన సాంకేతికతను సులువుగా తెలుసుకోవచ్చని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్ మాట్లాడుతూ అధ్యాపక అభివృద్ధి కార్యక్రమాలు అధ్యాపకులకు తమ విజ్ఞానాన్ని మెరుగుపరచి తద్వారా విద్యార్ధులు ఐఒటిలో నైపుణ్యం సాధించగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యన్నారాయణ, డీన్ ఆర్&డి ప్రొఫెసర్ పి.వి.ఎస్. మాచిరాజు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, ఇసిఇ విభాగాధిపతి డాక్టర్ కె. శివకుమారస్వామి, కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ వి. శైలజ, తదితరులు పాల్గొన్నారు.







