UPDATED 8th NOVEMBER 2017 WEDNESDAY 7:30 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచినట్లు కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు తెలిపారు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రజ్ఞా సంస్థకు సుమారు 15 మంది విద్యార్థులు ఎంపికకావడంపై ఆయన హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ, ఏవో కేఆర్ సందీప్, ఈవో జెన్నిబాబు, ఏసీవో పెదకాపు తదితరులు పాల్గొన్నారు.







