UPDATED 12th MARCH 2018 MONDAY 6:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, మొదటి సంవత్సరం విద్యార్థులు, ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగం సంయుక్తంగా స్వచ్ఛభారత్ మిషన్ అనే కార్యక్రమంపై అవగాహనా సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, పెద్దాపురం సెంట్రల్ సిల్క్ బోర్డు అధికారులు హాజరయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ రిప్రజంటేటివ్ రమేష్ బాబు, పెద్దాపురం సిల్క్ బోర్డు జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సి.శ్రీనివాస్ రిసోర్స్ పర్సన్స్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ తమ కళాశాలలో టెక్నికల్ విద్యతో పాటు ఇటువంటి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమేకాక, నైతిక విలువలను పెంపొందించే విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగంలా ఎన్.సి.సి, హోప్ ఫర్ చేంజ్, ఏకోక్లబ్, రోటరాక్ట్ క్లబ్ కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ మిషన్ అనేది ప్రతీ పౌరుడు తమ ఇంటి వద్ద ఆచరించడమేకాక పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం ద్వారా సాధించవచ్చని, దీనిని ఒక అలవాటుగా మార్చుకోవడం వలన ఆరోగ్యం, పరిశుభ్రత, వాతావరణ మార్పులు, వ్యవసాయ అభివృద్ధి, ఆహారోత్పత్తి, గ్రామీణ, పట్టణ అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్మంట్ ఎమ్.వి. హరనాథబాబు, డైరెక్టర్ డాక్టర్ జి.రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎమ్. సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.







