ప్రభుత్వం రైతులకు ఒరగబెట్టిందేమీలేదు

* పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప

UPDATED 30th OCTOBER 2020 FRIDAY 8:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతులకు ఒరగబెట్టిందేమీ లేదని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రులు గొప్పలు చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో చేసిందేమీ లేదని ఆరోపించారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతులు వారి భూములను త్యాగం చేస్తే ప్రస్తుతం వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారని అన్నారు. రైతులపై కేసులు పెట్టి వారిపై లాఠీచార్జీ చేయడం అమానుషమన్నారు. వరదలు, తుఫానులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వరదలతో నష్టపోయిన రైతులను లోకేష్‌ పరామర్శిస్తుంటే ఆయనపై కేసులు పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రైతులను సీఎం జగన్ ఆదుకుంటారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us