ఫిబ్రవరి 20, 21 తేదీల్లో చేనేతపై అవగాహనా సదస్సు

UPDATED 12th FEBRUARY 2018 MONDAY 6:00 PM

పెద్దాపురం: కేంద్రప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన యార్న్ సప్లైస్ స్కీంపై ఈ నెల 20, 21 తేదీల్లో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చేనేత కార్మికులకు స్థానిక భాస్కర కాలనీలోని ముప్పన రామారావు వీవర్స్ కమ్యూనిటీ హాల్లో సదస్సు నిర్వహించనున్నట్లు కాకినాడ ఎంపి తోట నరసింహం తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అధ్యక్షతన చైర్మన్ స్వగృహంలో చేనేత కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఎంపి నరసింహం మాట్లాడుతూ ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు నేరుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నూలు సరఫరా జరుగుతుందని, హ్యాండ్లూమ్ టెక్సటైల్స్ శాఖ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు అవగాహన కల్పిస్తారన్నారు. యార్న్ సరఫరా, చేనేత కార్మికుల సబ్సిడీలు, కేంద్ర ప్రభుత్వం చేనేతపై జి.ఎస్.టి. ప్రవేశపెట్టడం వల్ల ప్రస్తుతం చోటు చేసుకుంటున్న సంక్షోభం తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించడం జరుగుతుందన్నారు. జి.ఎస్.టి. వల్ల జిల్లాలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని, జి.ఎస్.టి. ని తొలగించి చేనేత పరిశ్రమను పరిరక్షించాలని పలువురు చేనేత ప్రతినిధులు ఎంపీకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us