UPDATED 21st JUNE 2017 WEDNESDAY 4:00 PM
పెద్దాపురం: తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక ప్రేమజంట బుధవారం పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ కు చెందిన సాలా రమ్య, సామర్లకోటకు చెందిన శ్రీరామ రవీంద్ర గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి వివాహానికి ఇరువర్గాల పెద్దలు అంగీకరించకపోవడంతో బుధవారం వారివురు పెళ్లి చేసుకున్నారు. అనంతరం పెద్దాపురం సిఐ ఎస్. ప్రసన్న వీరయ్య గౌడ్ ను ఆశ్రయించి ఇరువర్గాల తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఇదిలా ఉండగా వివాహం చేసుకున్న వీరివురు బావామరదళ్ళు కావడం విశేషం.







