Karnataka Road Accedent : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: బ్రిడ్జి పైనుంచి పడ్డ ట్రాక్టర్.. ఆరుగురు దుర్మరణం

UPDATED 15th MAY 2026 6:30 PM

Karnataka Road Accedent : కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మునీరాబాద్ సమీపంలో కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి కిందకు పడిపోవడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడగా, వారిలో పది మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

​పోలీసుల కథనం ప్రకారం.. బాధితులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ మునీరాబాద్ సమీపంలోని బ్రిడ్జిపై వెళ్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పింది. వేగంగా ఉన్న వాహనం బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొట్టి లోయ వంటి పల్లపు ప్రాంతంలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో సామర్థ్యానికి మించి జనం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ పల్టీలు కొట్టడంతో ఇంజిన్, ట్రాలీ మధ్య నలిగి ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ​క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లలో సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి అతివేగమే కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషాద ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us