Duronto Express Catches Fire : దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

UPDATED 27th NOVEMBER 2022 6:15 PM

Duronto Express Catches Fire : దురంతో ఎక్స్‌ప్రెస్‌లో మంటలు కలకలం రేపాయి. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-9 బోగీలో మంటలతో కూడిన పొగలు వచ్చాయి. ఇది గమనించిన డ్రైవర్‌.. కుప్పం రైల్వేస్టేషన్‌లో రైలును ఆపేశాడు. ఈ విషయం తెలిసిన ప్రయాణికులు రైలు దిగి పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాసేపటి తర్వాత రైలు తిరిగి బయలుదేరింది. అయితే, మంటలు స్వల్పంగా చెలరేగడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us