చెరువు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

UPDATED 8th JUNE 2017 THURSDAY 11:30 AM

పెద్దాపురం: నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో చేపడుతున్న చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధికారులను ఆదేశించారు. స్థానిక మరిడమ్మ దేవస్థానం సమీపంలో ఉన్న మానోజీ చెరువు, జగ్గంపేట రోడ్ లో ఉన్న చెరువులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో గల నాలుగు చెరువులను  నీరు-చెట్టు పథకం ద్వారా అభివృద్ధి పరచి సుందరమైన పార్క్ లుగా నిర్మిస్తున్నామని, అలాగే పెద్దాపురం పట్టణం లో రూ. 2 కోట్లతో శతాబ్ది పార్క్ నిర్మించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో చెరువు అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అలాగే రాబోయే రెండు సంవత్సరాలలో నియోజకవర్గాన్ని అన్ని హంగులతో మోడల్ నియోజక వర్గంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వర్షాలు ప్రారంభం కావడంతో చెరువు పనులకు కొంత ఇబ్బంది కలుగుతుందని అధికారులు ప్రణాళిక ప్రకారం చెరువుల అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, పట్టణ టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us