9 న ఆదిత్యలో ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు

UPDATED 7th JUNE 2017 WEDNESDAY 5:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 9 నుంచి 12 వ తేదీ వరకు ప్రముఖ కంపెనీలు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడారు. 9 వ తేదీన ఢిల్లీకి చెందిన ప్రముఖ కంపెనీ "టెక్నిక్స్" బిటెక్, ఈసీఈ, సీఎస్ఈ, ఐటి, ఈఈఈ విభాగాల్లో 60 శాతం మార్కులతో ఎటువంటి బ్యాక్ లాగ్ లేకుండా ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు రూ. రెండు లక్షలు వార్షిక వేతనం లభిస్తుందని ఆయన తెలిపారు. అలాగే 9,10 తేదీల్లో బెంగుళూరుకు చెందిన ప్రముఖ సంస్థ "ఎడెప్ట్ చిప్స్" లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని బిటెక్, ఎంటెక్, ఈసీఈ, విఎల్ఎస్ఐ విభాగాల్లో 70 శాతం మార్కులతో ఎటువంటి బ్యాక్ లాగ్ లేకుండా ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 1.80 లక్షలు వార్షిక వేతనం లభిస్తుందన్నారు. 10 వ తేదీన "ఒమేగా హెల్త్ కేర్" (భీమవరం) సంస్థ కు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, లేదా డిగ్రీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు. 12 వ తేదీన "కంప్యూటర్ వోనిక్స్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" సంస్థ మహారాష్ట్ర , ఒరిస్సా, బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో పనిచేయుటకు బిటెక్, ఈసీఈ, ఈఈఈ, విభాగాల్లో 50 శాతం మార్కులతో ఎటువంటి బ్యాక్ లాగ్ లేకుండా ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులకు వార్షిక వేతనం గా రూ.1.20 లక్షలు నుంచి రూ. 2 లక్షలు వేతనంతో పాటు అదనపు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ప్లేస్ మెంట్ ట్రైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us