RRR : ‘ఆర్ఆర్ఆర్’ సెకండ్ హాఫ్ వేయకుండానే సినిమా అయిపోయిందన్న అమెరికా థియేటర్

UPDATED 28th MARCH 2022 MONDAY 08:00 AM

RRR : ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ అయి మూడు రోజులు కావొస్తున్నా ఇంకా చాలా చోట్ల ‘ఆర్ఆర్ఆర్’ ఫీవర్ కనిపిస్తుంది. ఈ చిత్ర యూనిట్ కూడా వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హడావిడి చేస్తూనే ఉన్నారు. ఇక కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి ఈ సినిమాకి. మన సినిమాలకి ఓవర్సీస్ లో అతి పెద్ద మార్కెట్ అమెరికా. మన ప్రతి సినిమా అక్కడ భారీగా రిలీజ్ అవుతుంది. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు, భారతీయులు మన సినిమాలని చూస్తారు.

అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల రోజు అమెరికాలోని ఓ థియేటర్ లో విచిత్రం జరిగింది. ఓ థియేటర్ లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొదటి భాగం అయిపోగానే సినిమా అయిపోయిందని ప్రకటించారు. దీంతో సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన అమెరికాలోని నార్త్ హాలీవుడ్ లో ఉన్న సినీమార్క్ అనే థియేటర్లో జరిగింది. బాలీవుడ్ ప్రముఖ ఫిలిం క్రిటిక్ అనుపమ చోప్రా కూడా అక్కడ సినిమా చూడటానికి వెళ్లడంతో ఈ సంఘటన ఎదురయింది. దీంతో అనుపమ చోప్రా దీనిపై ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

అనుపమ ఈ ట్వీట్ లో.. ”ఇలా జరగడం మొదటిసారి. నార్త్ హాలీవుడ్ లో ఉన్న సినీమార్క్ థియేటర్ కి మొదటిరోజు RRR షో చూడటానికి వెళ్ళాను. ఫస్ట్ హాఫ్ చూశాను, కానీ సెకండాఫ్ వేయకుండానే సినిమా అయిపొయింది అన్నారు. థియేటర్ మేనేజిమెంట్ ని అడిగితే సినిమా ఇంకా ఎక్కువ ఉన్నట్లు తమకు తెలియదని, ఆదేశాలు అందలేదని తెలిపారు. నాకు విసుగుతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది” అని పోస్ట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి సెకండ్ హాఫ్ ని వేయడంతో ప్రేక్షకులు సంతోషంతో సినిమా చూసి వెళ్లారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us