UPDATED 5th JUNE 2017 MONDAY 3:00 PM
కాకినాడ : ఈ నెల 8న మహా సంకల్ప దీక్షలో పాల్గొననున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించే ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తో కలిసి పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాకినాడ చేరే పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లోని హెలిపాడ్ ని పరిశీలించారు. హెలిపాడ్ వద్ద తగిన బందోబస్తు, అలాగే ముఖ్యమంత్రి కి స్వాగతం పలికే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హెలిపాడ్ నుంచి ఆనంద భారతి గ్రౌండ్స్ వరకు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఆనందభారతి గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి సభాస్థలి, ఎక్సిబిషన్ ఏర్పాటు చేసే ప్రాంతాలు, బహిరంగసభ, విఐపి పార్కింగ్ మొదలైన అంశాలపై కలెక్టర్ సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పాల్గొనే మహాసంకల్పం కార్యక్రమం లో అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేయాలని ఎక్కడా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. మహా సంకల్పం జరిగే సభా ప్రాంగణం నిర్ణీత పద్దతిలో ఉండాలని కలెక్టర్ సూచించారు.







