UPDATED 19th JUNE 2017 MONDAY 11:00 AM
పెద్దాపురం: ప్రజా సంక్షేమ పథకాల అమలు టిడిపికే సాధ్యమని గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని పేర్కొన్నారు. మండలలోని కాండ్రకోట గ్రామంలో నిర్వహించిన సైకిళ్ళు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని సోమవారం మాట్లాడారు. ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు.అనంతరం వ్యవసాయమార్కెట్ కమిటి చైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి), ఎంపీపీ గుడాల రమేష్, జడ్పీటీసీ సుందరపల్లి శివనాగరాజు మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అనంతరం విద్యార్థినులకు సైకిళ్ళు అందచేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యానిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఛైర్మన్ గవరసాన శివరామకృష్ణ, ఎంపీటీసీ పేకేటి వెంకటేశ్వరరావు (దొరబాబు), సర్పంచ్ కుంచే గాంధీ, ఉపసర్పంచ్ ఎలిశెట్టి చక్రప్రకాష్, తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.







