UPDATED 23rd NOVEMBER 2022 WEDNESDAY 6:20 PM
Pushpa 2: ఐకాన్ స్టార్ నటించిన ‘పుష్ప – ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ మూవీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇక ఈ సినిమాకు వారు బ్రహ్మరథం పట్టడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించిన సుకుమార్ అండ్ టీమ్, ఇప్పటికే షూటింగ్‌ను ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.
ఇక ఈ సీక్వెల్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో రోజుకో వార్త వినిపిస్తోంది. పుష్ప పార్ట్-2లో ఓ లేడీ విలన్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నాడట సుకుమార్. ఈ పాత్రలో నటించేందుకు ఓ క్రేజీ బ్యూటీని ఎంపిక చేయాలని సుకుమార్ చూస్తున్నాడట. అయితే బన్నీతో ఇప్పటికే నటించిన హీరోయిన్ అయితే ఈ పాత్రను కంఫర్ట్‌గా చేయగలుగుతుందని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. అందుకే ఈ లేడీ విలన్ పాత్రలో అందాల భామ కేథరిన్ త్రేజాను సెలెక్ట్ చేసేందుకు పుష్ప టీమ్ ప్లాన్ చేస్తోందట.







