పోలీసు గార్డుల విశ్రాంతి భవనం ప్రారంభం

UPDATED 26th FEBRUARY 2018 MONDAY 6:30 PM

సామర్లకోట: తూర్పుగోదావరిజిల్లా సామర్లకోట మండలం అచ్చంపేటలో స్థానిక పంచాయతీ రిజర్వు స్థలంలో పోలీసు గార్డులకు విశ్రాంతి భవనాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ సోమవారం ప్రారంభించారు. అచ్చంపేటలో చినరాజప్ప నివాసం ఉండటంతో అక్కడ విధులు నిర్వహించే పోలీసులు 24 గంటలు ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీస్ హౌసింగ్ నిధుల నుంచి రూ. ఎనిమిది లక్షలతో విశ్రాంతి భవన నిర్మాణం జరిగినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, గ్రామ సర్పంచ్ పోతల నాగమహేశ్వరి, ఉప సర్పంచ్ పబ్బినీడి ఈశ్వరరావు, గుమ్మళ్ల రామకృష్ణ, అడబాల చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us