భద్రాచలంలో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

UPDATED 26th MARCH 2018 MONDAY 6:00 PM

భద్రాచలం: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా భద్రాచలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో సర్వాంగ సుందరంగా ముస్తాబైన మిథిలా ప్రాంగణంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున మూలవిరాట్‌కు సుప్రభాతం, ఆరాధన నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఊరేగింపుగా కల్యాణమండపానికి తీసుకువచ్చారు. అభిజిత్‌ లగ్నంలో సీతమ్మ మెడలో స్వామివారు మాంగల్యధారణ చేశారు. ప్రభుత్వం తరఫున సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమర్పించారు. రామదాసు పదోతరం వారసుల స్వామివారికి పట్టు పీతాంబరాలు సమర్పించారు. అభిజిత్‌ లగ్నంలో జరుగుతున్న జగత్కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో భద్రాద్రికి తరలివచ్చారు. భద్రాద్రి భక్తుల శ్రీరామ నామస్మరణతో మార్మోగింది.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us