Solar Eclipse : గ్రహణ సమయంలో నిలబడిన రోకలి

UPDATED 25th OCTOBER 2022 TUESDAY 07:10 PM

Solar Eclipse : తరాలు మారిన సనాతన సంప్రదాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అనడానికి ఈ చిత్రమే ఉదాహరణ. సూర్య గ్రహణం (Solar Eclipse) వచ్చినప్పుడు ప్లేట్ లో పసుపు నీళ్లు పోసి రోకలి నిలబెట్టే ఆచారం ఇంకా పోలేదు. సూర్య గ్రహణం సందర్భంగా రోకలిని నిలబెట్టిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో రంగంపేట చోటుచేసుకుంది.

సూర్యగ్రహణం రావడంతో.. గ్రామానికి చెందిన నూతులపాటి సత్యనారాయణ .. తమ ఇంటి వద్ద రోకలి నిలబెట్టారు. కొంతసేపు ఆ రోకలి అలాగే నిలబడింది. గ్రహణం వీడేంతవరకు ఎలాంటి ఆధారం లేకుండా రోకలి నిలబడుతుందని వారి నమ్మకం.

ఈ సందర్బంగా నిలబడిన రోకలికి చిన్నారుల చేత గుంజీలు తీయించారు. అలా చేస్తే చేసిన తప్పులను సూర్యభగవానుడు క్షమిస్తాడని వారు నమ్ముతున్నారు. దీనిని చూడటానికి గ్రామంలోని ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us