మహిళలు, చిన్నారుల సంరక్షణకు అభయం ప్రాజెక్ట్ యాప్

UPDATED 23rd NOVEMBER 2020 MONDAY 6:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): మహిళలు, చిన్నారుల సంరక్షణ కోసం రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ రూపొందించిన అభయం ప్రాజెక్టు యాప్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రాష్ట్రంలో లక్ష ఆటోలు, టాక్సీలకు వచ్చే సంవత్సరం నవంబర్ నెల నాటికి ఈ యాప్ సమకూర్చడం జరుగుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఓలా, ఉబర్, తదితర ప్రైవేట్ సంస్థల మాదిరిగా రాష్ట్ర రవాణా సంస్థ ఈ యాప్ ను అభివృద్ధి చేసి ఆటోలు, టాక్సీల్లో ప్రయాణించే వారికి రక్షణ సేవలు అందించే విధంగా రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us