‘శ్రుతి..మీ లైఫ్‌లో ఎన్ని బ్రేకప్‌లున్నాయ్‌?’..నెటిజన్‌ ప్రశ్నకు నటి స్ట్రాంగ్‌ రిప్లయ్‌

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 ‌: చాలా సంవత్సరాల గ్యాప్‌ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు శ్రుతిహాసన్‌. ఆమె ఇన్‌స్టాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. షూటింగ్స్‌ నుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా, ఇంట్లో ఉన్నప్పుడు కాస్త బోరింగ్‌గా అనిపించినా వెంటనే ఆమె ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో మాట్లాడేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. తాజాగా ఆమె గురువారం సాయంత్రం నెటిజన్లతో కాసేపు సరదాగా మాట్లాడారు. కొత్త సంవత్సరంలో తాను చేయనున్న సినిమాలపై ముచ్చటించారు. తన అభిరుచులను మరోసారి అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘‘శ్రుతి.. ఇప్పటివరకూ మీ జీవితంలో ఎన్ని బ్రేకప్‌లున్నాయి?’’ అని ప్రశ్నించగా.. వెంటనే ‘‘మీకెంత మంది గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు?’’ అని ఎదురు ప్రశ్నించింది. ‘‘నీకు ఎంతమంది లవర్స్‌ ఉన్నారు? నువ్వు ప్రశ్నలు అడిగిన విధానం బట్టి చూస్తే నీకస్సలు లవర్‌ ఉండకపోయి ఉండొచ్చు అని నా అభిప్రాయం’’ అని ఆమె రిప్లయ్‌ ఇచ్చారు. కమల్‌హాసన్‌ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్‌.. కెరీర్‌ ఆరంభంలోనే స్టార్‌, యువ హీరోల సరసన నటించి మంచి మార్కులు కొట్టేశారు. హీరోయిన్‌గా రాణిస్తున్న తరుణంలోనే లండన్‌కు చెందిన వ్యక్తితో ఆమె ప్రేమలో పడ్డారు. వ్యక్తిగత కారణాల వల్ల వాళ్లిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఆమె శాంతాను అనే ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌తో ప్రేమలో ఉన్నారు. శాంతాను అంటే తనకెంతో ఇష్టమని ఆమె ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే ‘వకీల్‌సాబ్‌’, ‘క్రాక్‌’తో హిట్‌ అందుకున్న శ్రుతి.. ప్రస్తుతం బాలకృష్ణ-గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రానున్న సినిమాలో నటించనున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us