Konaseema Thirumala Vadapalli : వైభవంగా అష్టదళ పాదపద్మారాధన

UPDATED 19th OCTOBER 2022 WEDNESDAY 06:00 AM

కన్నుల పండువగా వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు

గరుడ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు 

Konaseema Thirumala Vadapalli : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజైన మంగళవారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సప్తకలశారాధన, మహాస్నపనం, వసంతోత్సవం, ప్రధాన హోమాలు నిర్వహించారు. సాయంత్రం స్వస్తివచనం, ప్రధాన హోమాలు, హనుమత్‌ మూలమంత్ర హవనము, పంచశయ్యాదివాసములను మేళతాళ మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ రమణీయంగా నిర్వహించారు.

వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు పూజలను తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి మూలవిరాట్‌కు అష్టదళ పాదపద్మారాధన నిర్వహించారు. 108 బంగారు పుష్పాలతో స్వామివారి పాదాలచెంత అష్టోత్తర శతనామావళి జరిపారు. అయినవిల్లి వరసిద్ధివినాయక ఆలయ చైర్మన్‌ నంబూరి వెంకటరమణరాజు ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక ఎక్స్‌అఫీషియో సురేష్‌, సిబ్బంది పట్టువస్త్రాలు, ఫలపుష్పాలను తీసుకువచ్చి శ్రీవారికి సమర్పించారు.

స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి వేదపండితుల ఆశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటాలను అందజేశారు. ప్రాకార మండపం ఫల, పుష్పాల అలంకరణతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యుద్దీపాలంకరణ, డిజిటల్‌ స్వాగత ద్వారాలు భక్తులను కనువిందు చేశాయి. మహిళల కోలాట ప్రదర్శన అలరించింది.

మంగళవారం రాత్రి శ్రీవారు పట్టు పీతాంబరాలు, వజ్ర, స్వర్ణాభరణాలతో మలయప్పగా అలంకృతుడై గరుడ వాహనంపై విహరించారు. ఆలయ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు-హైమాపార్వతి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు పి.సురేష్‌రాజు, మన్యం సూర్యకుమారిభాను, రెడ్డి రవీదేవి, మెర్ల వెంకటేశ్వర్లు, ఏపుగంటి కనకారావు, శెనగన సత్యనారాయణ, కొపనాతి శారదాంబ తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us