కోల్‌కతా దుర్గా పూజకు యునెస్కో వారసత్వ హోదా

కోల్‌కతా (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దుర్గా పూజకు అరుదైన గౌరవం దక్కింది. మానవ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నట్లు యునెస్కో ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. భారత దేశానికి అభినందనలు తెలుపుతూ, దుర్గా మాత విగ్రహాన్ని పోస్ట్‌ చేసింది. యునెస్కో ట్వీట్‌ను ప్రధాని మోదీ తన ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ, సంతోషించదగ్గ సందర్భంగా అభివర్ణించారు. దీనిపట్ల పశ్చిమ బెంగాల్‌ వారసత్వ కమిషన్‌ ఛైర్మన్‌ సువప్రసన్న, అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us