ముగిసిన మహిళా సంఘాల ప్రతినిధుల శిక్షణ

UPDATED 2nd MAY 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో జిల్లాలోని మహిళా సంఘాల ఎనిమిదవ బ్యాచ్ ప్రతినిధులకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా కోర్సు డైరెక్టర్ ఎ. గోపాలరావు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మహిళల ఆరోగ్యం, మహిళా సాధికారిత, పిల్లల ఆరోగ్యం, బాల్య వివాహాలు అరికట్టడం వంటి అంశాలపై మూడు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించామని, శిక్షణ పొందిన మహిళలు వారి మండలాల పరిధిలోని గ్రామాలలోని మహిళా సంఘాలకు తిరిగి శిక్షణ ఇవ్వవలసి ఉంటుందని అన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా సంఘాలకు బ్యాగులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీలు టి. కుమార్ రాజా, ఎస్.కె. మొహిద్దీన్, ఎఎన్ఎం కుమారి, మహిళా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us