ఆదిత్యలో పరిశోధన ఆవశ్యకతపై శిక్షణా శిబిరం

UPDATED 23rd JULY 2017 SUNDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ లో పరిశోధన ఆవశ్యకత నూతన విధానాలు అనే అంశంపై ఉపాధ్యాయులకు శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఐఎంఎస్ (ఘజియాబాద్) నుంచి వచ్చిన డాక్టర్ ధీరజ్ శర్మ విద్యా వ్యవస్థలో పరిశోధన ప్రముఖ పాత్ర పోషిస్తోందని, కేస్ స్టడీస్ వంటి అంశాలు విద్యార్థులకు ఎంతో లాభదాయకమన్నారు. అలాగే వాటిని ఏ విధంగా రూపొందించాలి, విద్యార్థులతో వాటిని ఎలా విశ్లేషింపచేయాలి అనే అంశాలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ ఆదిత్యలో విద్యార్థులకు అత్యున్నత విలువలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎప్పటికప్పుడు నూతన విషయాలపై విద్యార్థులకు శిక్షణా శిబిరాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్ ఎన్. విశాలాక్షి, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us