Yashoda: యూఎస్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న యశోద

UPDATED 16th NOVEMBER 2022 WEDNESDAY 9:20 PM

Yashoda: స్టార్ బ్యూటీ సమంత నటించిన రీసెంట్ మూవీ ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. సమంత చాలా రోజుల తరువాత స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండటంతో ‘యశోద’కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్ల పరంగానూ స్ట్రాంగ్‌గా ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాకు ఓవర్సీస్‌లో మాత్రం సూపర్ రెస్పాన్స్ దక్కుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అక్కడ హాఫ్ మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసి ఔరా అనిపించింది.

ఇదే స్పీడును కొనసాగిస్తే, యశోద మూవీ ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ క్లబ్‌లో అడుగు పెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక సరోగసి నేపథ్యంలో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీలో సమంత పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉందని అభిమానలు అంటున్నారు. ఈ సినిమాను హరి, హరీశ్‌లు సంయుక్తంగా డైరెక్ట్ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us