Anna Canteen: అన్న క్యాంటీన్లను తొలగించి.. పేదల పొట్ట కొట్టిన వైసీపీ ప్రభుత్వం : ఎమ్మెల్యే చినరాజప్ప

UPDATED 13th SEPTEMBER 2022 TUESDAY 01:00 PM

Anna Canteen : టీడీపీ (TDP) ప్రభుత్వ హాయంలో పేదల ఆకలిని తీర్చేందుకు ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లను (Anna Canteen) వైసీపీ అధికారం చేపట్టిన తరువాత తొలగించి పేదల పొట్టకొట్టిందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప (Nimmakayala Chinarajappa) అన్నారు. పట్టణంలో స్థానిక సంతమార్కెట్ సమీపంలో అన్న క్యాంటీన్ పేరుతో భోజన వితరణ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు పట్టెడన్నం పెట్టమని వైసీపీ (YCP) ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకో లేదని పేదలను ఆకలి తీర్చడానికి వైసీపీ ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు. ఎంతో మంచి ఆశయంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లను ఏర్పాటుచేసి పేదల ఆకలిని తీర్చిందన్నారు. పేదల కడుపుకొట్టిన పాపం ఊరికేపోదని మండిపడ్డారు. టీడీపీ అన్న క్యాంటీన్ లను ఏర్పాటుచేస్తుంటే ఆపే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని వైసీపీ ప్రభుత్వ తీరును విమ ర్శించారు. అన్న క్యాంటీన్లను ఆపే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. త్వరలోనే రాష్ట్రం అంతా అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us