కడప (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డికి నార్కో పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ పిటిషన్‌ను పులివెందుల కోర్టు విచారణకు స్వీకరించింది. నార్కో పరీక్షల కోసం త్వరలోనే శివశంకర్‌రెడ్డి సమ్మతిని పులివెందుల కోర్టు కోరనుంది. శివశంకర్ రెడ్డి ప్రస్తుతం కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఇవాళ పులివెందుల కోర్టు తీర్పు వెల్లడించనుంది. సాయంత్రంలోపు బెయిల్‌పై తీర్పు వెలువరించనుంది.







