అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు మరో శుభవార్త చెప్పింది. ఇటీవల మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసి కొంత మేర ధరలు తగ్గించిన ప్రభుత్వం తాజాగా మరో వెసులు బాటు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల పనివేళలు గంట పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాల పనివేళలు పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఖాతాల నిర్వహణకు మరో గంట సమయ పొడిగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని బేవరేజెస్ కార్పొరేషన్ దుకాణాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.







