నవ నిర్మాణ దీక్షలు విజయవంతానికి కృషి

UPDATED 4th JUNE 2018 MONDAY 9:00 PM 

సామర్లకోట: గ్రామాలలో నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షలు విజయవంతానికి సంబంధిత నోడల్ అధికారులు ప్రత్యేక కృషి చేయాలని ఎంపిడివో కె. స్వప్న అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలు నిర్వహించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వీటి నిర్వహణలో అలసత్వం వహించరాదని, గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శేఖర్, ఈవోపీఆర్డీ జగ్గారావు, ఎంఈవో, ఏఈవో, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us