UPDATED 1st JUNE 2017 THURSDAY 11:00 AM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో పోలేరమ్మ జాతర మహోత్సవాలలో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. సుమారు 10 మంది యువతులను ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి బహిరంగంగా బుధవారం అశ్లీల నృత్యాలు నిర్వహించారు. సాక్షాత్తూ హోం మంత్రి ఇలాఖాలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడం పట్ల పలువురు పోలీసుల తీరును బహిరంగంగా విమర్శిస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్ విభాగాలు జాతర విషయంలో అప్రమత్తంగా లేరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిఘా వైఫల్యం కొట్టచ్చినట్లు కనిపిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. అలాగే ఈ విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు సైతం సీరియస్ అయినట్లు సమాచారం. నిఘా వైఫల్యానికి కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.







