UPDATED 22nd NOVEMBER 2017 WEDNESDAY 7:00 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో మహారాణీ 182వ వర్దంతిని స్థానిక మహారాణీ సత్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వర్దంతి కార్యక్రమానికి కాకినాడ ఎంపీ తోట నరసింహం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నార్తుల ఆకలిని తీర్చేందుకు మహారాణీ చేసిన సేవలు ఆమోఘమని కొనియాడారు. వందలాది ఎకరాలను సత్రంలో నిత్యాన్నదానం నిర్వహించేందుకు ఆమె ఎంతో ధాతృత్వంతో భూములను రాసి ఇచ్చిన మహానీయురాలు అన్నారు. అనంతరం ఆమె పేరుతో పేదలకు ఎంపీ చేతులమీదుగా దుప్పట్లు పంచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ ఛైర్మన్ కొరుపూరి రాజు, టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బొడ్డు బంగారుబాబు, కనకాల సుబ్రహ్మణ్యం, సత్రం ఈవో ఆర్.పుష్పనాధం తదితరులు పాల్గొన్నారు.







